శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (17:55 IST)

అసామాన్యుడి వీర విప్లవ కథే విడుదల-2 : నిర్మాత చింతపల్లి రామారావు

Chinthapalli Rama Rao
Chinthapalli Rama Rao
విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -2' చిత్రం డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..  ప్రముఖ నిర్మాత , శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర  తెలుగు హక్కులను దక్కించుకున్నారు ఈ చిత్రం తెలుగు  ట్రైలర్‌ను కథానాయకుడు విజయ్‌ సేతుపతి  ఇటీవల చెన్నయ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా ఈ చిత్రం విశేషాలను నిర్మాత చింతపల్లి రామారావు తెలుపుతూ '' ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రయిలర్‌తో పాటు పాటల్లో కూడా మంచి టెంపో ఉంది. ఈ చిత్ర కథాంశాన్ని చెప్పాలంటే.. '' పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే  'విడుదల-2'. ఈ చిత్రం తమిళ చిత్రం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. 
 
ఈ చిత్రంలో పెరుమాళ్‌ పాత్రకు  సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్‌ ఆయన పండించిన విధానం అద్భుతం. నటుడిగా విజయ్‌ సేతుపతి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం ఆయన పేరు మరింత పెరుగుతుంది. ఏడు సార్లు నేషనల్‌ అవార్డు అందుకున్న వెట్రీమారన్‌ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్రహీరోలదరూ ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ప్రళయం లాంటి సంగీతాన్ని అందించారు.
 
ఇక విజయ్‌, వెట్రిమారన్‌, ఇళయరాజా ఇలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రంలో పీటర్‌ హెయిన్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు, మంజు వారియర్‌ సహజ నటన ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. విజయ్‌, మంజు వారియర్‌ మధ్య ఎమోషన్స్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి. డిసెంబర్‌ 20న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధిస్తుంది' అన్నారు.