మంగళవారం, 11 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 11 మార్చి 2025 (18:54 IST)

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

Vijay Antony, Bhadrakali
Vijay Antony, Bhadrakali
తమిళ నటుడు విజయ్ ఆంటోని నటిస్తున్న తన  25వ చిత్రాన్ని ఈ వేసవిలో పాన్ ఇండియా  సినిమాగా  విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో ‘పరాశక్తి’ అనే టైటిల్‌తో గతంలో రిలీజ్ చేసారు. కాగా, ఇప్పుడు  ‘భద్రకాళి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు  ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మార్చి 12న సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు విజయ్ ఆంటోని తెలిపారు.
 
విజయ్ ఆంటోని సినిమాల్లో అమ్మ సెంటిమెంట్, కూతురు సెంటిమెంట్ ఉంటుంది. కాగా, ‘భద్రకాళి’  కథ అమ్మవారి నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. సినిమాను దర్శకుడు అరుణ్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.