Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda At ED office
గేమింగ్ యాప్ గురించి కాకుండా బెట్టింగ్ యాప్ గురించి విజయ్ దేవరకొండ ఎంక్వరికి వెళ్ళాడనేది దయచేసి మార్చండి అంటూ మీడియా వారినుద్దేశించి ఈరోజు విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ పరిశోధన జరుగుతుంది. వారికి కూడా నా పేరు ఎందుకు వచ్చిందో తెలీదు. గేమింగ్ యాప్ కూ బెట్టింగ్ యాప్ కూ సంబంధమే లేదు. గేమింగ్ యాప్ అనేవి ప్రభుత్వం గుర్తించినవి. వాటి కంపెనీలు రిజిష్టర్ అయినవి. మీరు గూగుల్ లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్ కు వెళి కొడితే కొన్ని వస్తాయి అని విజయ్ దేవరకొండ అన్నారు.
మంగళవారంనాడు ఈడీ విచారణ ముగిసింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన బటయకు వస్తూ అన్న మాటలవి. విజయ్ మీడియా ముందు మాట్లాడుతూ.. ' నన్ను పిలిచింది ఇల్లిగిల్ యాప్స్ కేసులో కాదు.. గేమింగ్ యాప్ క్లారిఫికేషన్ కోసం పిలిచారు. హెడ్ లైన్స్ లో అవి మార్చండి. బెట్టింగ్ యాప్ ఇన్వేస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. ఈ విచారణలో నా పేరు ఎందుకు వచ్చిందో వారికి కూడా తెలియదు. నా పేరు వచ్చింది కాబట్టి వచ్చి వాళ్లు అడిగిన డిటైల్స్ ఇచ్చాను. A23 తెలంగాణలో ఓపెన్ కాదు. ఇక్కడ మీరు ఓపెన్ చేయలేరు అని మెసేజ్ వస్తుంది. లీగల్ గా ఉన్న గేమ్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశాను' అంటూ తెలిపారు.