శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (10:21 IST)

అన్‌స్టాపబుల్ సీజన్ 4లో వియ్యంకులు చంద్రబాబు, బాలకృష్ణ మనోభావాలు చెప్పబోతున్నారు

Balayya welcomes to CBN
Balayya welcomes to CBN
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె' సీజన్ 4 మొదటి ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్‌ షూట్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్‌స్టాపబుల్ సెట్స్ కి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పుష్పగుచ్ఛం అందించి బాలకృష్ణ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
 
NBK, Balayya
NBK, Balayya
తొలి ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ మధ్య అద్భుతమైన సంభాషణల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 25న ఆహా లో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎక్సయిటింగ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ గెట్ రెడీ.
 
ఇప్పటికే రాజకీయంగా, నటనా పరంగా బాలక్రిష్ణ బిజీగా వుంటూ ఇప్పుడు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ తో మరోసారి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసారి వారిద్ధరి మధ్య రాజకీయంగా ఎక్కువగా చర్చ జరగున్నదని తెలుస్తోంది. మరోవైపు తెలుగు చలన చిత్ర రంగం గురించి ప్రభుత్వపరంగా కొత్త ప్రణాళికలు చంద్రబాబు వివరించనున్నట్లు తెలుస్తోంది.