శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (15:27 IST)

ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో "గుంటూరు కారం" స్ట్రీమింగ్

guntur kaaram
మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "గుంటూరు కారం". సంక్రాంతి కానుకగా విడుదలై మిశ్రమ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా కుమ్మేసింది. ఇప్పటివరకు ఏకంగా రూ.215 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ నెల 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ సినిమా విడుదలైన తొలి రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. లాంగ్ రన్‌లో మాత్రం రూ.215 కోట్ల మేరకు వసూలు చేసింది. అయితే, థియేటర్‌కు వెళ్లి చూడని ప్రేక్షకులు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎపుడెపుడు అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఈ నెల 9వ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.