మంగళవారం, 8 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 8 జులై 2025 (12:01 IST)

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Nidhi - Venu
Nidhi - Venu
హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో "హరి హర వీరమల్లు", రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన "రాజా సాబ్" వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. తన అందం, నటనతో ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంటోంది నిధి. అందుకే ఆమె అటెండ్ అయ్యే మూవీ ఈవెంట్స్ లో ప్రేక్షకులు నిధి అగర్వాల్ పేరుతో స్లోగన్స్  ఇస్తున్నారు.
 
Nidhhi Agarwal
Nidhhi Agarwal
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన "హరి హర వీరమల్లు" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ మేనియా స్ఫష్టంగా కనిపించింది. నిధి అగర్వాల్ వేదిక మీదకు రాగానే ఆడియెన్స్ సందడి చేశారు. "హరి హర వీరమల్లు" చిత్రంలో పంచమి పాత్రలో నిధి అగర్వాల్ ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ప్రభాస్ తో నిధి చేసిన "రాజా సాబ్" డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఇదిలా వుండగా, ఇటీవలే విమర్శాత్మకమైన జ్యోతిష్యుడు వేణుస్వామి చేత హోమం చేయించుకుంది. ఈసందర్భంగా ఆమె ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. హోమం, పూజ అంతా నిధి అగర్వాల్ తన ఎడమచేతితోనే కార్యక్రమాలు పూర్తిచేసింది.  పూజాంతరం వేణు స్వామి కూడా ఆమెకు ఎడమచేతితో దిష్టి తీయడం విశేషం. ఈ పూజ అనంతరం ఆమె చాలా హ్యాపీగా వున్నట్లు తెలుస్తోంది.