శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (16:43 IST)

రామాయణంలో రావణుడిని నేనే.. సీతగా సాయిపల్లవి.. నేనే కారణం! (video)

Sai Pallavi_Yash
Sai Pallavi_Yash
నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రామాయణంలో రావణ్ పాత్రను పోషించనున్నట్లు కేజీఎఫ్ ఫేమ్ యష్ అధికారికంగా ధృవీకరించారు. లాస్ ఏంజిల్స్‌లో తన రాబోయే చిత్రం టాక్సిక్ కోసం విజువల్ ఎఫెక్ట్స్‌పై పని చేస్తున్న సమయంలో ఈ ఐకానిక్ పాత్రకు తన ప్రయాణం ఎలా సాగిందో యష్ పంచుకున్నాడు. 
 
రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనున్న ఈ సినిమాలో యశ్ రావణుడిగా నటించనున్నాడు. ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ "అవును రామాయణం చిత్రంలో నేను రావణుడిగా నటిస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చాడు. 
 
అంతే కాకుండా ఈ సినిమాలో సీతగా సాయిపల్లవిని ఎంచుకోవడానికి కారణం నేనే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 2025లో సెట్స్‌కు వెళుతుందట. దాదాపు 6 నెలల డేట్స్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్ అనంతరం తాను కేజీఎఫ్-3 మీద దృష్టి సారిస్తానని చెప్పాడు.