శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (15:54 IST)

హర్షద్ మెహతా స్పూర్తిగా వైట్ అండ్ బ్లాక్ మనీ నేపథ్యంతో జీబ్రా చిత్రం

manoj, sathya dev and others
manoj, sathya dev and others
దేశఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన వ్యక్తి హర్షద్ మెహతా. ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలీయకపోవచ్చు. ఇప్పుడు ఆయన పేరుతో ఓ పాత్రను సునీల్ చేత చేయించి సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ లీడ్ రోల్స్ తో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం  'జీబ్రా'. ఈ చిత్ర టీజర్ ఈరోజే హైదరాబాద్ లోని ఎ.ఎం.బి. మాల్ లో జరిగింది. ముఖ్య అతిథి మంచు మనోజ్ ఆవిష్కరించారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, సత్యదేవ్. తను వండర్ ఫుల్ యాక్టర్. తన యాక్టింగ్ కి నేను ఫ్యాన్ ని. టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సత్యరాజ్ గారి క్యారెక్టర్ వేరే లెవల్ వుంది. దర్శకుడు తెలుగు నేర్చుకొని సినిమా చేయడం హ్యాట్సప్. ఆర్ఆర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు. 
 
ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈరోజు నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియాద్వారా లాంచ్ చేశారు.
 
టీజర్ జీబ్రా ప్రపంచంలోకి ఒక గ్లింప్స్ అందిస్తుంది. టీజర్ లో  బ్లాక్ హార్స్ గా  సత్య దేవ్ ఒక MNCలో పనిచేసే వ్యక్తిగా పరిచమయ్యారు. వైట్ హార్స్ గా ధనంజయ ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించారు. సునీల్‌ ని బ్యాడ్ గాయ్ గా చూపించారు. సత్యరాజ్  వెరీ మ్యాడ్ మ్యాన్.  Wi-Fi పాస్‌వర్డ్ చివరి ఎపిసోడ్ నవ్వులని పంచింది.
 
టీజర్ డబ్బు, కార్లు, ఓడలు, విమానాలు, ఆవుతో సహా అనేక రకాల ఎలిమెంట్స్ ని ప్రజెంట్ చేసింది. ఇవన్నీ కథనానికి కీలకంగా వుంటాయి. ఈశ్వర్ కార్తీక్ కథను వినోదాత్మకంగా ఉంచుతూ డార్క్ బ్యాక్ డ్రాప్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. సత్యదేవ్, ధనంజయ తమ విభిన్న పాత్రలలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటోతో పాటు మిగతా నటీనటులు టీజర్ లో అలరించారు.  
 
రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెరేటివ్ ని ఎంగేజింగ్ గా ఉంచింది.  సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్ అందించిన విజువల్స్ అద్భుతంగా వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్  ఎడిటర్. మేకర్స్ ముందుగా అనౌన్స్ చేసినట్లుగా, జీబ్రా అక్టోబర్ 31 న దీపావళి సందర్భంగా అన్ని దక్షిణ భారతీయ భాషలు, హిందీలో థియేటర్లలోకి వస్తుంది.  
 
సత్యదేవ్ మాట్లాడుతూ, ఈశ్వర్ చాలా క్లారిటీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇందులో చాలా కొత్త క్యారెక్టర్ తో రాబోతున్నాను. చాలా హ్యుజ్ కాస్టింగ్ వున్న సినిమా ఇది. ట్రూ నేషనల్ ఫిల్మ్ ఇది. అన్ని పరిశ్రమల్లో అర్టిస్టులు, టెక్నిషియన్స్ పని ఇందులో పని చేశారు. ధన నేను ఒకటే బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాం. మా కెరీర్ గ్రాఫ్ ఒకటే. తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ధన, నా కెరీర్ లో ఇది మైల్ స్టోన్ ఫిల్మ్. డబ్భు అంటే ఇష్టం వున్న ప్రతి వ్యక్తికి ఈ సినిమా నచ్చుతుంది. డబ్బు మీద చేసిన సినిమా ఇది. వైట్, బ్లాక్ మనీతో పాటు చాలా ఎలిమెంట్స్ మిమ్మల్ని అలరిస్తాయి అన్నారు.  
 
డాలీ ధనంజయ మాట్లాడుతూ,  ఈశ్వర్ మైసూర్ వచ్చి ఈ కథ చెప్పారు. చాలా నచ్చింది. సత్యకి, మాకు  జీబ్రా మరో అద్భుతమైన సినిమా కాబోతోంది. పుష్ప లో జాలిరెడ్డి తర్వాత జీబ్రాలో ఆదిగా వస్తున్నాను. తెలుగు నేర్చుకుని నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పాను అన్నారు.