శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:41 IST)

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది: రామ్ గోపాల్ వర్మ

Satya Yadu, Aaradhya Devi
Satya Yadu, Aaradhya Devi
రామ్ గోపాల్ వర్మ తాజాగా 'శారీ' అనే సైకో చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. టైటిల్ కి  'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ కూడా జోడయింది. పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో 'శారీ'ని ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' చిత్రం రూపొందుతోంది. అమ్మాయిలపై ఎన్నో యాసిడ్ దాడులు  చూసివున్నాము. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లో  'శారీ కిల్లర్' అమాయకులైన ఎంతో మంది మహిళలను అతి క్రూరంగా మానభంగం చేసి చిత్ర హింసలకు గురిచేసి  హత్యలు చేయడం జరిగింది. ఆ మృగాడి కి మగువలపై ఎంతటి తీవ్రమైన కాంక్ష ఉండేదో వాడి చర్యలు తెలియచేస్తాయి. ఈ అంశాల ఆధారంగానే శారీ చిత్రం రూపొందిందిది.  
 
చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్ గా...  ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఇందులోని ప్రధానాంశం. ఇందులో అబ్బాయిగా సత్య యాదు నటిస్తూండగా, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. ఆరాధ్య దేవి కేరళకు చెందిన అమ్మాయి- ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది. ఆర్జీవీ డెన్ అనగానే అంతా కార్పోరేట్ స్టైల్ ఉంటుంది. అక్కడ శారీ ధరించే అమ్మాయి పాత్ర కోసం ఆరాధ్య దేవిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం!  
 
నిజానికి ఆరాధ్యను రామ్ గోపాల్ వర్మ ఎవరో తనకు ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్ లో తొలుత చూశారు. ఈ అమ్మాయి అయితే 'శారీ'లో బాగుంటుందని సూచించారు. ఇన్ స్టాలో ఆయనకు వచ్చిన రీల్ లో తొలుత ఆయన దృష్టిని ఆరాధ్య ఆకర్షించింది. ఇక శారీలోని అమ్మాయిని చూసి ఉద్రేకం చెందే అబ్బాయి పాత్రకు సత్య యాదును కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.