శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Modified: శనివారం, 3 ఫిబ్రవరి 2024 (16:01 IST)

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం లోని రెండో పాటను విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad released Honeymoon Express song
Vijayendra Prasad released Honeymoon Express song
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". తనికెళ్ల భరణి ,  సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్,  బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.
 
అయితే కళ్యాణి మాలిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వరపరిచిన మరో రొమాంటిక్ పాట 'ప్రేమ' ను బాహుబలి విజయేంద్ర ప్రసాద్ గారు విడుదల చేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అందమైన ప్రేమ గీతానికి అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ప్రాణం పోశారు.
 
అయితే ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు ఆర్ పి పట్నాయక్, గోపి మోహన్, చైతన్య ప్రసాద్, రవి వర్మ తదితరులు ప్రత్యక్షం గాను, ఆస్కార్ అవార్డు విజేత ఎమ్ ఎమ్ కీరవాణి, అవసరాల శ్రీనివాస్, ఇంద్రగంటి మోహన కృష్ణ గార్లు వీడియో కాల్స్ తో తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా కీరవాణి గారు కళ్యాణి మాలిక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇటీవల విడుదల అయిన నిజమా పాట అద్భుతంగా ఉంది, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది అని కొనియాడి ఇప్పుడు రెండో పాట 'ప్రేమ' కి మరింత ఆదరణ లభించాలి అని ఆశీర్వదించారు.