రూ. 15 లక్షల థార్ కారులో బ్లింకిట్ డెలివరీ మేన్ వచ్చాడు, వీడియో వైరల్ (video)
ఆమధ్య స్విగ్గీ ఆర్డర్ డెలివరీని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఓ ఖరీదైన కారులో వచ్చి వెళ్లిపోయాడంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బ్లింకిట్ ఆర్డర్ అందుకున్న ఓ డెలివరీ మేన్ రూ. 15 లక్షల ఖరీదైన థార్ కారు వేసుకుని వస్తువును డెలివరీ ఇచ్చి వెళ్లాడట. నల్లటి మహీంద్రా థార్ కారులో అతడు వచ్చి కారు దిగి ఆర్డర్ చేసిన వారికి అందించి వెళ్లడాన్ని సదరు వినియోగదారుడు మేడ పైనుంచి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడని చెబుతున్నారు.
బ్లింకిట్ డెలివరీ ఇచ్చేందుకు థార్ కారులో నిజంగా డెలివరీ మేన్ వచ్చాడా... లేదంటే ఇదంతా పాపులారిటీ జిమ్మిక్కా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే... బ్లింకిట్ కంపెనీ తాము నియమించుకున్న డెలివరీ పర్సన్స్ కి థార్ కారులో తిరగేంత జీతం ఇస్తున్నారా అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐతే అసలు విషయం మాత్రం అస్పష్టంగానే వుంది.