Pawan Kalyan: బిగ్ సి బాలు కుమార్తె నిశ్చితార్థ వేడుక.. హాజరైన పవన్ దంపతులు (video)
బిగ్ సి సంస్థల చైర్మన్ బాలు చౌదరి కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థ వేడుక శ్రీనీష్‌తో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్నా లెజ్‌నోవా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు అచ్చెం నాయుడు, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
అందమైన చీరకట్టులో అన్నా లెజ్‌నోవా, జీన్స్ విత్ వైట్ కుర్తాతో పవన్ కల్యాణ్ డ్రెస్ కోడ్ అదిరింది. నిశ్చితార్థ వేడుక వేదికపై అన్నా, పవన్ దంపతులను చూసిన నెటిజన్లు చూడముచ్చటగా వున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వేడుకలో పవన్ దంపతుల వీడియోలను పీకే ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.