శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 మే 2024 (19:30 IST)

నా బిడ్డ షర్మిలను కడపలో గెలిపించండి: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన - video

sharmila Reddy-Vijayamma
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఏపీ పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ సంచలన ప్రకటన చేసారు. వీడియా ద్వారా ఆమె తన సందేశాన్ని పంపారు. తన బిడ్డ వైఎస్ షర్మిల కడప పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగిందనీ, ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. వీడియో సందేశంలో విజయమ్మ ఇలా చెప్పారు.
 
" కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ను అభిమానించే, ప్రేమించేవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తుంది. కడప జిల్లా ప్రజలకు సేవే చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను" అని విజ్ఞప్తి చేసారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుండగా విజయమ్మ చేసిన ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షర్మిల వర్సెస్ జగన్ అన్నట్లుగా ఈ పరిస్థితుల్లో విజయమ్మ షర్మిలకు అనుకూలంగా సందేశం పంపడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.