శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (19:45 IST)

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

Man Sleep
మంచి ఆరోగ్యంతో జీవించాలంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు నిద్ర కూడా అవసరం. అయితే మారుతున్న ఆధునిక జీవనశైలిలో అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. స్క్రీన్‌పై పనిచేయడం లేదా అర్థరాత్రి వరకు ఫోన్ ఉపయోగించడం, రోజూ తొందరగా నిద్రలేచే అలవాటు కారణంగా కొంతమంది ఖాళీ సమయంలో కూడా సమయానికి నిద్రపోలేరు. 
 
Man Sleep
ప్రతిరోజూ అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం లేదా సరైన నిద్ర పట్టకపోవడం వల్ల ఎవరి ఆరోగ్యనికైనా హాని కలుగుతుంది. ప్రస్తుతం దేశంలో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. కట్ చేస్తే.. ఓ వ్యక్తి రోడ్డుకు పక్కన వున్న గోడపై హాయిగా నిద్రపోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
"మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం.. చూడండి ఎంత హాయిగా పడుకున్నాడో.. అందరికి ఇలాంటి నిద్ర రాదు." అంటూ వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇంకా ఈ వీడియోలో అలా గోడపై నిద్రిస్తున్న వ్యక్తి నిద్రలేపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆ గోడకు అడ్డు గోడ లేదు. నిద్రించే మనిషి అటు మళ్లినా.. ఇటు మళ్లినా ప్రమాదమే.