శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 12 జూన్ 2024 (13:37 IST)

ఇటు మెగాస్టార్ అటు పవర్ స్టార్ మధ్యలో ప్రధానమంత్రి (video)

Chiru-Modi-Pawan
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో బుధవారం ఉదయం చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వేడుకకు కేంద్రమంత్రులు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రమాణ స్వీకారం వేడుక ముగిసాక ప్రధానమంత్రి నరేంద్ర మోడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లారు.
 
ఆయనను పలుకరిస్తూ... నీ తమ్ముడు తుఫాన్ అంటూ నవ్వుతూ ఇరువురు చేతులను పట్టుకుని పైకి లేపి ప్రజలకు అభివాదం చేసారు. ఈ అరుదైన ఘట్టాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషంతో హర్షధ్వానాలు చేసారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మంత్రివర్గంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను...
ఎట్టకేలకు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడితో పాటు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రజా రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేజిక్కించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేయడంలో కీలకపాత్ర పోషించాలన్న మెగా ఫ్యామిలీ తపనకు తెరపడింది. 
 
కేసరపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకటించిన మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగా స్టార్ చిరంజీవి పాదాలను తాకగా, నారా లోకేష్ నాయుడు పాదాలను తాకి, ప్రధాని మోడీ, గవర్నర్, అమిత్ షాల ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
"కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను" అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్‌తో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది.