గురువారం, 14 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఆగస్టు 2025 (16:23 IST)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

Sada tears on stray dogs
ఒక్క వీధి కుక్క కూడా ఢిల్లీ వీధుల్లో తిరగకుండా చూడాలంటూ ఆదేశించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో సినీ నటి సదా బోరుమంటూ విలపిస్తోంది. అయ్యో... ఆ 3 లక్షల వీధి కుక్కలను చంపేస్తారా? వాటికి షెల్టర్లు కల్పించడం ఇప్పుడున్న వ్యవస్థల వల్ల కాదు. ఇలా లక్షల్లో వీధి కుక్కలను చంపేస్తారా? నేను ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరిని కలిస్తే ఈ దారుణం ఆగుతుందో తెలియడం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చేసింది. కాబట్టి కుక్కలకు చావు ఖాయం. దేవుడా ఏం చేయాలి అంటూ విలపిస్తోంది సదా.
 
ఒకవైపు కుక్క కాటుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకోవైపు ఎంతోమంది ర్యాబిస్ వ్యాధితో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ వీధుల్లో ఒక్క వీధి కుక్క కూడా తిరగడానికి వీల్లేదనీ, 8 వారాల్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఆదేశించింది. అధికారిక లెక్కల ప్రకారం, దేశ వ్యాప్తంగా గత ఏడాది సుమారు 37 లక్షల మంది కుక్క కాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 3 కోట్లకు పైగా వీధి కుక్కలున్నట్లు అంచనా. దీనితో వీధి కుక్కలు మనుషులపై స్త్వైర విహారం చేస్తున్నాయి. మరోవైపు జంతు ప్రేమికులు వీధికుక్కలకు సరిపడా షెల్టర్లు లేవని చెబుతున్నారు.
 
ఇదిలావుంటే సోషల్ మీడియాలో వీధికుక్కలపై Dogesh అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ కింద రకరకాల వీడియోలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది వీధికుక్కలను తరలించాల్సిందే, సరైన శిక్ష పడిందంటూ వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు వీధికుక్కలకు ఎంత కష్టం వచ్చింది అంటూ పోస్టులు పెడుతున్నారు.