శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2024 (23:20 IST)

పిఠాపురంలో బాలికపై అత్యాచారం: డిప్యూటీ సీఎం పవన్ సీరియస్

pawan kalyan
పిఠాపురంలో మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేసారు. అక్కడ స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించడంతో అతడు తప్పించుకునే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి అమానుష ఘటనను సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు.
 
బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసాననీ, ప్రభుత్వపరంగా బాధితురాలికి అన్నివిధాలా అండగా వుంటామని చెప్పారు. పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా వుండేందుకు అప్రమత్తంగా వుండాలని సూచించారు.