శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (11:33 IST)

ఇంటర్ విద్యలో సంస్కరణలు చేద్దామా లేదా? సూచనలు కోరిన ప్రభుత్వం

inter board
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంటర్ విద్యలో సమగ్రమైన మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. విద్యార్థుల అభివృద్ధిని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థకు కొత్త రూపు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు, విద్యా రంగ నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి, ఈ సమాచారం ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
 
పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల పునర్విమర్శ : ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న త్వరితగతి మార్పుల నేపథ్యంలో, పాఠ్య ప్రణాళికను నవీకరించడం అత్యంత అవసరం. కొత్త పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు తాజా సమాచారం మరియు నైపుణ్యాలను అందిస్తాయి.
 
కొత్త సబ్జెక్ట్ కాంబినేషన్‌లు : విద్యార్థులకు వారి ఆసక్తులకు అనుగుణంగా సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వడం మంచి నిర్ణయం. ఇది వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. పరీక్ష మార్కుల నమూనాలో మార్పులు చేయాలని భావిస్తుంది. అలాలగే, రొటీన్ అభ్యాసాన్ని తగ్గించి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచి విషయమన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సర బోర్డు పరీక్షలను తొలగించాలని భావిస్తుంది. విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది మంచి నిర్ణయం.
 
ఇంటర్మీడియట్ విద్యా సంస్కరణలు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ సంస్కరణలు విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దడానికి తోడ్పడతాయని, అయితే, ఈ సంస్కరణలు విజయవంతం కావాలంటే, అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరం అని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో తాజా ప్రతిపాదనలపై సలహాలు, సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తోంది.