గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (18:15 IST)

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

Raja Gautham, Priya Vadlamani
Raja Gautham, Priya Vadlamani
బ్రహ్మానందం, ఆయ‌న‌ కుమారుడు రాజా గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ స‌మ‌ర్ప‌కులుగా డెబ్యూ డైరెక్ట‌ర్‌ ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్ ద‌ర్శ‌క‌త్వంలో రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.
 
గురువారం ఈ సినిమా నుంచి  ‘ఆనందమాయే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. శాండిల్య పీస‌పాటి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ పాట‌ను శ్రీసాయి కిర‌ణ్ రాయ‌గా, మ‌నీషా ఈర‌బ‌త్తిని, య‌శ్వంత్ నాగ్ ఆల‌పించారు. పాటను గమనిస్తే.. ఇది క్యూట్ లవ్ సాంగ్ . ఇందులో హీరోపై త‌న ప్రేమ‌ను హీరోయిన్ అందంగా వివ‌రిస్తుంటే, హీరో మాత్రం త‌న‌కు డ‌బ్బు మీదున్న ప్రేమ‌, అవ‌స‌రాన్నిపాట‌గా పాడుకుంటున్నారు. ఇద్ద‌రు భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలున్న వ్య‌క్తులుగా హీరో, హీరోయిన్ ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు డైరెక్ట‌ర్ నిఖిల్‌. చ‌క్క‌టి పదాలు, విన‌సొంపైన ట్యూన్‌తో పాట‌ హృద్యంగా హ‌త్తుకునేలా ఉంది.
 
వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు. మితేష్ పర్వతనేని డీవోపీగా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.