సోమవారం, 15 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2025 (16:21 IST)

తితిదే ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్, ఆయనొస్తున్నారా... భలేగా చేయిస్తారు

Anil kumar singhal
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనిల్ కుమార్ తితిదే ఈవోగా పని చేసారు. ఆ సమయంలో భక్తుల సౌకర్యాల విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపిస్తూ వుండేవారు. మళ్లీ మరోసారి ఆయన తితిదే ఈవోగా నియమించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.