మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2025 (17:31 IST)

మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైకాపా నేతలు 106 కేసులు వేశారు : మంత్రి నారా లోకేశ్

pawan - nara lokesh
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తే దాన్ని అడ్డుకునేందుకు వేకాపా నేతలు ఏకంగా 106 కేసులు వేశారని విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన సోమవారం సచివాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో పవన్ ఛాంబర్‌కు వచ్చిన మంత్రి లోకేశ్.. ఈ నెల 25వ తేదీన  నిర్వహించే మెగా డీఎస్సీ విజేతలకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. 
 
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో జరిగిన భారీ నియామకంకావటంతో.. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. వైకాపా ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు దాదాపు 106 కేసులు వేశారని లోకేశ్‌ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. ఏళ్ల తరబడి టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేశ్‌ అన్నారు.