మద్యం కేసులో ఏపీ సర్కారు కీలక నిర్ణయం : రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తు!!
ఏపీలో వెలుగు చూసిన మద్యం స్కామ్ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం విధానం వ్యవహారంలో అక్రమాలకు పాల్పడడం ద్వారా కసిరెడ్డి సుమారు రూ.13 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కెసిరెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల షేర్లతోనూ ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
వయసుతో సమంబంధం లేదు - ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు : ఐశ్వర్య రాయ్
వయసుతో సమంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారని ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వినియోగంపై మాట్లాడుతూ, సోషల్ మీడియా వినియోగంపై తనకు ఎంతో ఆందోళనగా ఉందన్నారు. గుర్తింపు కోసం ప్రజలంతా ఆరాటపడుతున్నారని ఇది ఏమాత్రం మచింది కాదన్నారు.
సోషల్ మీడియా వినియోగం పెరిగిందన్న అంశంపై ఐశ్వర్యా మాట్లాడుతూ, సోషల్ మీడియా పోస్టులకు వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవన్నారు. మన విలువను ఏది నిర్ణయించలేదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. నా దృష్టిలో సోషల్ మీడియాకు, సామాజిక ఒత్తిడికి మధ్య పెద్ద తేడా లేదు. తల్లిగా నాకు ఈ విషయంలో ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు. దాన్ని దాటి చూసినపుడే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మగౌరవం కోసం సామాజిక మాధ్యమాల్లో వెతకొద్దు. అది ఖచ్చితంగా అక్కడ దొరకదు" అని ఐశ్వర్యా రాయ్ అన్నారు.