సోమవారం, 18 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 ఆగస్టు 2025 (16:00 IST)

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

Vaccine
ఫైజర్ భారతదేశంలో వయోజనుల కోసం తన తదుపరి తరం 20-వాలెం ట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (PCV20)ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత సెరోటైప్ కవరేజ్‌‌తో, ఫైజర్ అందించే ఈ వ్యాక్సిన్ వయోజనులకు న్యుమోకాకల్ వ్యాధి నుండి రక్షణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
 
ఫైజర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్, ఇన్వాసివ్, నాన్-ఇన్వాసివ్ న్యుమోకాకల్ వ్యాధులకు కారణమైన క్లినికల్ సంబంధిత 20 సెరోటైప్‌ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక పరిస్థితులతో వుండే వారితో సహా వయోజనులందరికీ సకాలంలో, చురుకైన రక్షణను అందిస్తుంది. PCV20 సింగిల్ షాట్ వ్యాక్సిన్‌గా అందుబాటులో ఉంటుంది. PCV20తో టీకాలు వేసిన వారికి రెండో డోస్ అవసరం ఉండకపోవచ్చు.
 
ఈ సందర్భంగా ఫైజర్ లిమిటెడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మీనాక్షి నెవాటియా మాట్లాడుతూ, మా 20-వాలెంట్ న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ PCV20ని భారతదేశంలో ప్రారంభించడం పట్ల మేం ఉత్సాహంగా ఉన్నాం. 20 న్యుమోకాకల్ వ్యాధి సెరోటైప్‌ల విస్తృత కవరేజ్‌తో ఉన్న ఈ వ్యాక్సిన్ మన దేశంలో పెరుగుతున్న వయోజన రోగనిరోధకత అవసరాన్ని తీరుస్తుందని మేం విశ్వసిస్తున్నాం అని అన్నారు.
 
50 ఏళ్లు పైబడిన పెద్దలు, అలాగే ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిస్ వంటి కోమోర్బిడిటీలు ఉన్న వ్యక్తులకు న్యుమోకాకల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా సమస్యలు, ఆసుపత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యంతో మరణం కూడా సంభవించవచ్చు.
 
న్యుమోకాకల్ వ్యాధి వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి సకాలంలో రోగనిరోధకత చాలా కీలకం. న్యుమోకాకల్ వ్యాధి భారాన్ని తగ్గించడానికి పీసీవీలతో టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన ప్రజారోగ్య సాధనాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో పీవీసీ20ని ప్రవేశపెట్టడం అనేది నివారణ ఆరోగ్యం పట్ల ఫైజర్ దీర్ఘకాలిక నిబద్ధతను బలోపేతం చేస్తుంది. న్యుమోకాకల్ వ్యాక్సిన్ ఆవిష్కరణలో 25 సంవత్సరాల నాయకత్వాన్ని పెంచుతుంది.