శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

పవన్ కళ్యాణ్ టూర్ ఎఫెక్ట్ - మాజీ సీఎం జగన్‌కు సర్కారు షాక్!

jagan
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటూ సర్కారు ఉత్తర్వాలు జారీచేసింది. 
 
ఇటీవల వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ ఆస్తుల వివాదం కోర్టుకు చేరింది. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు జగన్ తాలూకు మాచవరంలోని సరస్వతి పవర్ అసైన్డ్ భూములను పరిశీలించారు. ఈ సంస్థకు చెందిన భూములపై ఆరా తీయాల్సిందిగా అధికారులన ఆయన ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఎంఆర్వో క్షమారాణి, వీఆర్వో అఖిల్, ఆర్ఐ కోటేశ్వర రావు, సర్వేయర్ సాల్మన్ రాజు, దాచేపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కె.విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, మనోజ్, సరస్వతి సిమెంట్, పవర్ భూములను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.