శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (12:07 IST)

అమ్మాయికి మెసేజ్ చేసిన యువకుడిపై దాడి.. వారిలో ఒక్కడికి యాక్సిడెంట్.. కర్మంటే ఇదే!

Boy Attacked
Boy Attacked
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయికి మెస్సెజ్ చేశాడని యువకులు పాశావికంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇంటర్ చదువుతున్న యువకుడిని స్నేహితులు దారుణంగా కొట్టారు.
 
పొలాల్లోకి లాక్కెళ్లి ఇష్టమున్నట్లు బాదారు. అంతే కాకుండా.. అతని బట్టలు చింపివేసి, కొబ్బరి మట్టతో దాడులు సైతం చేశారు. ఈనెల 5వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తొంది. అయితే.. సదరు బాధితుడు మలికి పురంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు. దీనిపై ప్రస్తుతం పెను దుమారం చెలరేగింది. 
Accident
Accident
 
ఇదిలా ఉండగా.. ఇటీవల యువకుడిపై దాడికి పాల్పడిన వారిలో.. ఒక యువకుడు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అంతే కాకుండా..అతనికి కుట్లు కూడా పడ్డాయంట. దీంతో ఈ ఘటన మాత్రం తెగ వైరల్‌గా మారింది.