శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (11:12 IST)

తిరుమలలో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన చంద్రబాబు

Chandra babu
తిరుమల కొండలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏర్పాటు చేసిన వకుళమాత వంటశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ బస చేసి, తొమ్మిది రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్, 2025 డైరీని కూడా సీఎం ఆవిష్కరించారు.
 
మరోవైపు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, రాష్ట్ర పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధికారులతో కూడిన కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 
 
దీనిపై చంద్రబాబు స్పందించారు. తిరుపతి లడ్డూ పవిత్రతను కించపరచకుండా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.