మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (08:47 IST)

ధ్వజ స్తంభానికి వేలాడదీసే కొక్కెం విరిగిపోయింది.. అంతే.. టీటీడీ

TTD
తిరుమల శ్రీవారి ఆలయంపై రకరకాల అసత్య ప్రచారం జరిగింది. ధ్వజ స్తంభానికి వేలాడదీసే కొక్కెం విరిగిపోయిందనే వచ్చే వార్తల్లో నిజం లేదని టీటీడీ తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటిదేమీ లేదని, ఇలాంటి వదంతులను భక్తులు నమ్మవద్దని సూచించింది. 
 
బ్రహ్మోత్సవాలకు ముందు సాధారణంగా శ్రీవారి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం ఆనవాయతీ. భిన్నమైన వస్తువులు కనిపిస్తే వాటిని తొలగించి కొత్తవి అమరుస్తారు. అందులో భాగంగానే ధ్వజపటాన్ని ఎగురవేసే కొక్కెం మార్చి దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారు. 
 
ఇందులో ఎలాంటి అపచారం జరగలేదని టీటీడీ స్పష్టం చేసింది. కొక్కెం మార్చడాన్ని అపచారంగా భావిస్తూ కొందరు ప్రచారం చేశారు. ఈ వదంతులు నమ్మొద్దని, తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని పేర్కొన్నారు.