శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (17:18 IST)

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

narendra modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 29వ తేదీన వైజాగ్ సిటీకి వస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన వైజాగ్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రసాద్ వెల్లడించారు. 29వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.