శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (18:43 IST)

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

Modi_Jawans Diwali
Modi_Jawans Diwali
దీపావళి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో జరుపుకుంటారు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ ప్రతీ సంవత్సరం మోదీ సైనికులతో దీపావళి జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. ఈ సంవత్సరం గుజరాత్‌లోని కచ్‌కి వెళ్లారు. సొంత రాష్ట్రంలో ఆర్మీ జవాన్లను కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పారు. 
 
ఈ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ వారికి స్వీట్లు తినిపించారు. ప్రతీ సంవత్సరం దీపావళి వేడుకల సమయంలోమన సైనికులు సరిహద్దు అవతల ఉన్న దేశాల సైనికులకు స్వీట్లు పంచుతారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ సైతం.. వారితో దీపావళి జరుపుకుంటుండటం వల్ల సైనికుల్లో ఆత్మీయతా భావం పెరుగుతోంది. ప్రధాని మనతోనే ఉన్నారనే భావన పెరుగుతోంది.