మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 సెప్టెంబరు 2025 (13:06 IST)

నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఎలాంటివారో తెలుసా?: సీఎం చంద్రబాబు (video)

Chandrababu-Pawan
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి, ఆయన పట్టుదల గురించి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.... నన్ను అరెస్ట్ చేసినప్పుడు పవన్ కల్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ కేన్సిల్ చేసారు. ఎంత పట్టుదలతో, నా ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే నేను రాలేనా అని రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు.
 
ఐతే నందిగామ దగ్గర ఆయన్ను ఆపేశారు. ఐనప్పటికీ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత రోడ్డు మీదనే పడుకుని ధర్నా చేసారు. మామూలుగా సినిమాల్లో ఇలాంటివన్నీ చేస్తుంటారు. షూటింగుల్లో చేస్తుంటారు. నిజజీవితంలో పోరాట యోధుడిగా నిలబడిన వ్యక్తి నా మిత్రుడు పవన్ కల్యాణ్ గారు'' అంటూ వెల్లడించారు.