శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 నవంబరు 2024 (13:16 IST)

నా గురువు చెప్పినట్లు చేస్తున్నా: యాగంటి క్షేత్రంలో మహిళా అఘోరి పూజలు (video)

Lady Aghori
నిన్న శ్రీకాళహస్తిలో దర్శనం కోసం వెళ్లిన మహిళా అఘోరి తనకు ఆలయ ప్రవేశం లేకుండా చేసారంటూ ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె కర్నూలు లోని యాగంటి క్షేత్రంలో పరమేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేసింది. తన గురువుగారు చెప్పిన మార్గంలో నడుస్తున్నాననీ, లోక కళ్యాణం చేయడానికి మాత్రమే వచ్చానంటూ చెప్పుకొచ్చింది.
 
సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెపుతున్న ఈ మహిళా అఘోరీ, కుంభమేళా ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు అక్కడికి వెళ్లి మళ్లీ వస్తాను అని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో తన పర్యటన ఉంటుందన్న అఘోరి, యాగంటి దర్శనానంతరం మహానందికి బయలుదేరి వెళ్లింది.