శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (19:06 IST)

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

Lotus
పురాణాల ప్రకారం శ్రీ మహా లక్ష్మీదేవి తామర పువ్వులో నుంచి ఉద్భవించింది. అందుకే అమ్మవారికి లక్ష్మీపూజ సమయంలో ఎనిమిది తామర పువ్వులు సమర్పిస్తారు. దీపావళి లక్ష్మీ పూజలో ఎనిమిది తామర పువ్వులను సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ సందర్భంగా లక్ష్మీ బీజ మంత్రాన్ని పఠించాలి. మంత్రం పఠించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును స్వాగతించడంలో కూడా సహాయపడుతుంది.
 
"ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్
ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమః॥" అనే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. సర్వశుభాలు చేకూరుతాయి. ఎనిమిది తామర పూలను సమర్పించి మహాలక్ష్మీ దేవి ముందు కూర్చుని ఈ లక్ష్మీ బీజ్ మంత్రాన్ని జపించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.