శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 మే 2024 (11:28 IST)

వైకాపా పాలనలో అపచారం.. దుర్గమ్మ సన్నిధిలో అధికారి రాసలీలలు!

romance
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పాలనలో ప్రజలకే కాదు చివరకు హిందూ దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. గతంలో రామతీర్థంలో రాముల విగ్రహం తల తెగనరికారు. ఆ తర్వాత అనేక ఆలయాల్లో అపచారం జరిగింది. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి క్షేత్రంలో ఆలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన చాంబర్‌కు పిలిపించుకుని వారు చేసిన చిన్నచిన్న తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోబరుచుకున్నారు. 
 
మూడు రోజుల క్రితం కూడా ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ రాసలీలల ఎపిసోడ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సదరు ఇంజనీరింగ్ అధికారిపై ఆలయ సిబ్బందిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ ఉదంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు. మరోవైపు, పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటి చోటు చేసుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.