శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్
ఇటీవలికాలంలో పాకిస్థాన్ అతర్జాతీయ వేదికలపై పదేపదే అభాసుపాలవుతోంది. తాజాగా దిత్వా తుఫాను కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ఇందులోభాగంగా, భారత్ సాగర్ బంధు పేరుతో సహాయక చర్యలు అందిస్తోంది. ఈ క్రమంలో లంకకు సాయం చేసేందుకు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది. అయితే, ఈ సహాయం పేరుతో లంకకు పాకిస్థాన్ పంపిన వస్తువుల కాలపరిమితి ముగిసిపోయిది. ఈ విషయాన్ని శ్రీలంక అధికారులు చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పాకిస్థాన్ పంపిన వైద్య సామాగ్రి, ఆహార పొట్లాలు, ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన మానవతా సహాయంలో గడవు తేదీ ముగిసిన వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. ఇది పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు, సామాజికమాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై శ్రీలంక అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
పాకిస్థాన్‌కు పంపిన సామాగ్రి కొలంబో చేరుకున్న విషయాన్ని తెలియజేస్తూ శ్రీలంకకు పాకిస్థఆన్ ఎల్లపుడూ అండగా ఉంటుదని ముద్రించిన ప్యాకెట్లను శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే, ఈ ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబరుతో ముగిసిపోయింది. ఇది గమనించిన శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో పాకిస్థాన్ చేసిన సాయం బూడిదలోపోసిన పన్నీరులా తయారైంది.