బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (12:37 IST)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్.. కండువా కప్పిన జగన్

Sailajanath
Sailajanath
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. 
 
శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. 
 
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు.

2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఈ సందర్భంగా మీడియాతో శైలజానాథ్ మాట్లాడుతూ... జగన్ నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.