శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (14:39 IST)

పిఠాపురం బాలిక అత్యాచార ఘటన.. రోజా ఫైర్.. పవన్ రిప్లై

Pitapuram
Pitapuram
పిఠాపురంలో ఓ బాలిక‌పై అత్యాచారం ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ విష‌య‌మై మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అన‌బ‌డే ఉప ముఖ్య‌మంత్రి గారూ అంటూ ట్వీట్ చేసిన మాజీ మంత్రి... దేవుడు త‌మ‌రికి పుట్టుక‌తో బుద్ధి, జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉప‌యోగించండి స్వామి.. అంటూ దుయ్య‌బ‌ట్టారు. దీంతో రోజా ట్వీట్‌పై జ‌న‌సేనాని స్పందించారు. 
 
పిఠాపురానికి చెందిన బాలిక‌పై మాధ‌వ‌రం చెత్త డంపింగ్ వ‌ద్ద జ‌రిగిన అఘాయిత్యం చాలా బాధ క‌లిగించింద‌న్నారు. స్థానికులు నిందితుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించార‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఈ లైంగిక దాడి ఘ‌ట‌న‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల‌ని కోరారు. అలాగే బాధితురాలికి అన్ని విధాల ఆదుకోవ‌డంతో పాటు నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేలా చేస్తామ‌ని డిప్యూటీ సీఎం చెప్పారు.