శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2024 (13:52 IST)

గుంటూరు ప్రజలకు గుడ్ న్యూస్: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 98 కోట్లు

guntur
గుంటూరు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆయన ఎక్స్ పేజీలో ఈమేరకు పోస్ట్ చేస్తూ... శంకర్ విలాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతూ వుండటంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి CRIF సేతు బంధన్ పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలోని గుంటూరు-నల్లపాడు రైల్వే సెక్షన్‌లో 4-లేన్ శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి ₹98 కోట్లను ఆమోదించినట్లు ఆయన తెలియజేసారు.
 
కాగా ఎన్నికల సమయంలో ప్రస్తుత కేంద్రమంత్రి, లోక్ సభ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ తాము అధికారంలోకి వస్తే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకుని వెళ్లి నిధులు రాబట్టారు.