శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (12:24 IST)

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

irrigation projects
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన రిజర్వాయర్లలోకి భారీగా ఇన్ ఫ్లో నమోదైంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యం ఉన్న తుంగభద్ర జలాశయం వద్ద గరిష్టంగా 1633 అడుగులకు గాను.. 1631.93 అడుగులకు నీరు చేరుకోవడంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేశారు. 
 
రిజర్వాయర్‌కు 50,593 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ఫ్లో 36,799 క్యూసెక్కులుగా వుంది. తుంగభద్ర పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 101.500 టీఎంసీల నిల్వ ఉంది. 
 
నంద్యాలలోని శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇన్‌ఫ్లో 79,536 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 67,626 క్యూసెక్కులుగా నమోదైంది. 
 
శ్రీశైలం పూర్తి స్థాయి 885 అడుగుల దిగువన 884.50 అడుగులకు చేరుకుంది. మొత్తం సామర్థ్యం 215.8070 టీఎంసీలకుగాను ఇక్కడ నిల్వ సామర్థ్యం 212.9198 టీఎంసీలుగా ఉంది. ఏపీలో భారీ వర్షాల కారణంగా స్థానిక రహదారులు చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. 
 
విశాఖపట్నం, కాకినాడలోని బీచ్‌ల్లో భీకర అలలు నివాసితులు భయాందోళనలకు గురయ్యేలా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాలతోపాటు మండలాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.