'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'అఖండ-2'. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. రవి పినిశెట్టి కీలక పాత్రను పోషించారు. అయితే, గురువారం రాత్రి నుంచి ఈ చిత్రం ప్రీమియర్ షోలను దేశ వ్యాప్తంగా ప్రదర్శించాల్సివుంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఈ షోలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఇండియాలో ఈ రోజు జరగాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నాం. మా వంతు మేం ఎంతగానో ప్రయత్నించాం. కానీ, కొన్ని అంశాలు మా నియంత్రణలో ఉండవు. అసౌకర్యానికి క్షమించండి. అని పోస్టులో పేర్కొంది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం ప్రీమియర్ షోలను యధావిధిగా ప్రదర్శితమవుతాయని ప్రకటించింది.
బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా 'అఖండ-2' వస్తుండటం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ప్రీమియర్ షోల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ రద్దుతో కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలకానుంది. ఈ ప్రీమియర్ షోల రద్దు వల్ల సాధారణ ప్రదర్శనలపై ఎలాంటి ప్రభావం చూపబోతని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.