మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జులై 2025 (10:58 IST)

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

Tiger
Tiger
తిరుమల ఘాట్ రోడ్డులో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుతపులి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ ఫుటేజ్‌లో చిరుతపులి జంట వైపు దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. కానీ చిరుత దాడి నుంచి ఆ జంట తప్పించుకుంది. 
 
ఈ సంఘటనను బైక్ వెనుక ప్రయాణిస్తున్న బైకర్లు తీశారు. చిరుతలు, తిరుమల ఘాట్ రోడ్లలో కనిపిస్తున్నందున భక్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే తిరుమల ఘాట్ రోడ్లపై చిరుతలతో పాటు ఇతర అడవి జంతువులు కనిపిస్తున్నందున, యాత్రికులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కోరారు.