శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 జులై 2024 (18:39 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం: మరో 7 రోజులు వర్షాలు

rain
బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో దీని ప్రభావం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
 
దీని ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ, వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు జూలై 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వున్నదనీ, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేసారు.