శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2024 (10:41 IST)

నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఎపుడు పుడుతుందంటే...

low pressure
నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల రెండో వారం అంటే 6 లేదా 7 తేదీల్లో ఇది ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇది తీరం వైనపుకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఇదికాకుండా, ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది మాత్రం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు శనివారం సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.