శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2025 (09:41 IST)

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు

earthquake
ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే కొద్దిసేపటికే భూకంపనాలు ఆగడంతో పొదిలివాసులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. 
 
కాగా పొదిలిలో భూకంపం రావడం ఇది మొదటిసారి కాదు. గత మే 6న ఉదయం 9.54 గంటలకు కూడా ఇదే ప్రాంతంలో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఇక సుమారు ఏడు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూకంప అనుభవం రావడంతో పొదిలి ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.