శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (15:15 IST)

మిగిలేది జగన్ ఒక్కరే, సజ్జల-సాయిరెడ్డి కూడా వుండరు: షర్మిల జోస్యం

ys sharmila
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిపి తయారుచేసారన్న ఆరోపణలు రావడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందులో వాస్తవాలను వెలికి తీయాలనీ, తాము హోంశాఖకు లేఖ రాస్తామని తెలిపారు. భక్తులు ఎంతో పవిత్రంగా తిరుమల లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తారని, అలాంటి లడ్డూలను కల్తీ నెయ్యితో తయారుచేయడం ఏంటనీ, ఈ విషయాన్ని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసారు.
 
తన తండ్రి వైఎస్సార్ అన్నీ మంచిపనులు చేసి మహనీయుడు అనిపించుకుంటే.. ఆయన కడుపున పుట్టిన జగన్ అన్నీ చెడ్డ పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా... తిరుమల పవిత్రతను పాడుచేసే పనులు జరుగుతున్నా ఏమీ తెలియనట్లు వ్యవహరించడం దారుణమన్నారు.
 
వైసిపి పని అయిపోయిందనీ, ఆ పార్టీ అధ్యక్షుడికి ప్రజల మనోభావాలతో సంబంధం లేదని అన్నారు. అందువల్లనే ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారనీ, త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిలు కూడా వెళ్లిపోతారని జోస్యం చెప్పారు.