శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (20:23 IST)

ఆద్యతో పవన్ కల్యాణ్ సెల్ఫీ.. నెట్టింట వైరల్ (video)

Pawan Adya Selfie
Pawan Adya Selfie
కాకినాడలో, తండ్రీ కూతుళ్లను హత్తుకునే ఘట్టం ప్రజల హృదయాలను కొల్లగొట్టింది. ఉన్నత పదవుల్లో వున్నా.. తండ్రీకూతుళ్ల అనుబంధానికి తెరపడేది లేదు. ఇందుకు ఏపీ డిప్యూటీ సీఎం మినహాయింపు కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తె పట్ల ఆప్యాయతగా వుంటారు. 
 
పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సెల్ఫీ తీసుకున్నారు.
 
అలాగే కాకినాడలో పవన్ కల్యాణ్ జెండాను ఆవిష్కరించారు. అయితే జెండా ఆవిష్కరణకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కు పోలీసు జాగిలం పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికింది. 
ఈ సందర్భంగా పవన్ మోకాళ్లపై కూర్చుని జాగిలం నుంచి బొకే తీసుకుని దానికి సెల్యూట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.