గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 నవంబరు 2025 (16:25 IST)

పవన్ కళ్యాణ్ తిరుమల భక్తులను అలా కాపాడారు: జనసేన పొలిటికల్ మిస్సైల్

pawan kalyan
ఢిల్లీ కారు పేలుడికి ముందు గుజరాత్ ఏటీఎస్ తీవ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. సైనైడ్ కంటే 6 వేల రెట్లు విషపూరితమైన రైసిన్ 40 కిలోలు పట్టుకున్నారు. రైసిన్ అనేది కేవలం 50 మిల్లీగ్రాములు మనిషి సేవిస్తే ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే ఛాన్స్ వుండదు. అటువంటి ప్రమాదకర రసాయనాన్ని ఉగ్రవాదులు ఏకంగా 40 కిలోలు సిద్ధం చేసి వుంచారు. ఇటువంటి రైసిన్ ను ఉగ్రవాదులు ప్రసాదాల్లో కలిపితే ఏమవుతుందంటూ జనసేన పొలిటిల్ మిస్సైల్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రసాదాల్లో కల్తీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. 
 
అత్యధికంగా భక్తులు స్వీకరించే ప్రసాదంలో కలిపి సామూహిక హత్య చెయ్యాలనేది తీవ్రవాదుల కుట్ర అనీ, ఆ కుట్రను గుజరాత్ ATS భగ్నం చేసింది. పట్టుబడింది హైదరాబాదులో కాబట్టి వాళ్ళ టార్గెట్ తిరుమల ప్రసాదం అయి ఉండొచ్చనే అనుమానాలను జనసేన పొలిటిల్ మిస్సైల్ వెల్లడిస్తోంది. ఐతే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తిరుమల ప్రసాదం కల్తీపై పోరాడకపోయి ఉంటే.. జగన్ అధికారంలో ఉంటూ అదే కల్తీ జరుగుతా ఉండి ఉంటే రాష్ట్రంలో చాలా పెద్ద ఉపద్రవం జరిగేదని ఆందోళన వ్యక్తం చేసింది.