గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (10:45 IST)

తిరుమల: డిక్లరేషన్‌పై సంతకం చేసిన పవన్ చిన్న కుమార్తె అంజనీ (video)

Pawan- Daughters
Pawan- Daughters
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పాలినా అంజనీ కొణిదెల తిరుమలలో ఆలయ ఆచార వ్యవహారాలను అనుసరించి డిక్లరేషన్‌పై సంతకం చేశారు. తిరుమలలో వేంకటేశ్వరుడిని ఆరాధించడానికి హిందువేతరులు ఎవరైనా వెళితే హిందూ మతంపై విశ్వాసం ఉన్న ప్రకటనపై సంతకం చేయడం టిటిడిలో ఆచారం. అందుకు తగ్గట్టుగానే గెస్ట్ హౌస్‌లో పవన్ కూతురు డిక్లరేషన్‌పై సంతకం చేసింది. 
 
సంతకం కోసం టీటీడీ అధికారులు అతిథి గృహానికి తీసుకెళ్లారు. ఆమె మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సంతకం చేశారు. ఇక బుధవారం పవన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.