శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2024 (09:25 IST)

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. తిరుపతిలో ప్రొఫెసర్ అరెస్ట్

harrasment
పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఓ ప్రొఫెసర్ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఒక విద్యార్థిని లైంగికంగా వేధించినందుకు ఆ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు.
 
శ్రీ వేంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.  క్రాప్ ఫిజియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమా మహేష్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. ఇందుకోసం వీడియో ఆధారం దొరికిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ వీడియో ఆధారంగా పోలీసులు ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ ఫ్లైఓవర్ దగ్గర ఉమా మహేష్‌ను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చిన్న గోవిందు మీడియాకు తెలియజేశారు.