శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:00 IST)

నింగికి ఎగసిన PSLVC60-SpaDex.. 220 కిలోల బరువుతో పైకి లేచిన రాకెట్

PSLVC60
PSLVC60
PSLVC60-SpaDex నింగికి ఎగసింది. దీంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలో అద్భుతం చేసినట్లైంది. సోమవారం PSLV-C60 రాకెట్ శ్రీహరికోట నుండి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX) మిషన్‌తో బయలుదేరింది. PSLV రెండు చిన్న అంతరిక్ష నౌకలు, SDX01, ఛేజర్, SDX02లు నింగికి ఎగిరాయి. 
 
ఒక్కొక్కటి 220 కిలోల బరువుతో పైకి లేచింది. తక్కువ-భూమి వృత్తాకార కక్ష్యలో డాకింగ్ కోసం ఉపగ్రహాలు విలీనం చేయబడ్డాయి. ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి చేర్చిన పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టు మొత్తం బృందానికి అభినందనలు అంటూ సోమనాథ్ తెలిపారు. 
 
మరో వారం రోజుల్లో డాకింగ్ ప్రక్రియ పూర్తవుతుందని సోమనాథ్ అన్నారు. ఉపగ్రహాలకు సోలార్‌ ప్యానెల్స్‌ని విజయవంతంగా అమర్చినట్లు ఆయన పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావటం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.