శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (16:58 IST)

GSAT-N2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో (video)

GSAT-N2
GSAT-N2
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ అమెరికాలోని కేప్ కెనావెరల్ నుండి కమ్యూనికేషన్ శాటిలైట్, GSAT-N2ను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ విషయాన్ని ఇస్రో వాణిజ్య విభాగం ఎన్‌ఎస్‌ఐఎల్ తెలిపింది. ఈ ఉపగ్రహం పూర్తి వాణిజ్య అవసరాలకు సంబంధించినది. 
 
కమ్యూనికేషన్ శాటిలైట్ భారత ప్రాంతం అంతటా బ్రాడ్‌బ్యాండ్ సేవలను, ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) తెలిపింది. 
 
ఇస్రో ప్రస్తుత ప్రయోగ సామర్థ్యాల కంటే ఈ ఉపగ్రహం బరువైనందున, విదేశీ ప్రయోగ వాహనాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని అగ్రశ్రేణి అంతరిక్ష శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
జీశాట్ ఎన్-2తో ఉపయోగాలు.. 
జీశాట్ 20 ఉపగ్రహాన్ని జీశాట్ ఎన్-2 అని కూడా పిలుస్తారు. 
దీని బరువు ఏకంగా 4,700 కిలోలు 
దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించవచ్చు.
విమానాల్లో ప్రయాణికులకు ఇంటర్నెట్‌ సేవలను అందించవచ్చు. 
విమానాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించవచ్చు.